400 కోట్లు వస్తే.. 39కోట్ల లెక్క చూపించారు: కేటీఆర్ కౌంటర్

Sunday, March 18th, 2018, 12:25:50 AM IST

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఏ విధంగా మాట్లాడినా చాలా సూటిగా ఉంటుంది. ప్రశ్నించడంలో అయినా ప్రతి స్పందించడంలో అయినా కేటీఆర్ దైర్యం కనిపిస్తుందని సోషల్ మీడియాలో యువత కామెంట్స్ చేస్తుండడం అందరికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో ఎలాంటి విషయంపై అయినా స్పందిస్తున్నారు. ఎలాంటి వారు సహాయం కోరినా కూడా ట్విట్టర్ ద్వారా వెంటనే జవాబు ఇస్తున్నారు. ఇకపోతే ప్రతిపక్షాలు చేసే విమర్శలపై కూడా కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు.

ఇటీవల కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలకు సమాధానంగా కేటీఆర్ ఇసుక కు సంబందించిన ఆదాయం గురించి వివరించారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2004 నుంచి 2014 వరకు ఇసుక ద్వారా ఏడాదికి సగటున ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.39కోట్లు. కానీ ఈ నాలుగేళ్లలో వచ్చిన ఆదాయం 100 రేట్లు పెరిగింది. 2014 నుంచి 2018 వరకు ఇసుక కు సంబందించిన ఆదాయం రూ.1609 కోట్లకు చేరుకుంది. ఈ నాలుగేళ్లలో సగటున ఏడాదికి 400 కోట్లు రాష్ట్ర ఆదాయంలో చేరుతుందని కేటీఆర్ తెలిపారు. ఇసుక ద్వారానే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని చెబుతూ.. కాంగ్రెస్ పాలన గురించి ప్రశ్నించారు. 39 కోట్ల లెక్క చూపించిన కాంగ్రెస్ ఆ డబ్బంతా ఏం చేసిందని ప్రశించారు. అసలు సంగతి ఇదంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇసుక మాఫియాను అరికట్టాలని నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.