గడ్డం పెంచితే గబ్బర్ సింగ్‌లు అయిపోతారా? : కేటీఆర్

Wednesday, May 2nd, 2018, 08:33:32 AM IST

ప్రస్తుతం తెలంగాణాలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ల మాటల యుద్ధం వేడెక్కుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియయర్ నేత కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆరెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆరెస్ ఓటమిని చూస్తుందని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదే విధంగా ఛాలెంజ్ విసురుతూ అధికారంలోకి వచ్చే వరకు గెడ్డం తీసుకోబమని కాంగ్రెస్ నేతలు అన్నారు. అయితే ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ ని ఉద్దేశిస్తూ.. గెడ్డం పెంచుకున్నవాళ్లంతా గబ్బర్ సింగ్ లు అయిపోలేరని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

అదే విధంగా గడ్డం పెంచుకుంటే ఏంటి?ఎక్కడికైనా పోతే ఏంటి? వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రతి విషయంలో కాంగ్రెస్ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని చెప్పిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ టీఆరెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈ విధంగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఇక ఏళ్ల పాటు పాలనా కొనసాగించిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నేతల్లో కొందరు ప్రగతి భవన్ లో గేట్లు విరగ్గొడతామని అంటున్నారని. మూడున్నరేళ్లుగా టీఆర్ఎస్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments