గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కడు పవన్ కళ్యాణ్ కాదు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Friday, October 12th, 2018, 02:00:10 AM IST

తెలంగాణా ఎన్నికలకు సమయం ఎంతో లేకపోయేసరికి అన్ని పార్టీల నేతలు ప్రజల్లో మమేకం అవుతున్నారు.ఒకరి యొక్క వైఫల్యాలను మరొకరు ఎత్తి చూపుతూ,విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నారు.ఇప్పుడు తాజాగా తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ టీకాంగ్రెస్ నేతలపై మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేశారు.ఈ రోజు కాంగ్రెస్ నాయకులు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేస్తామని అంటున్నారని,కానీ తన అధ్యయనంలో తెలంగాణలో అసలు 1 లక్ష ఋణం తీసుకున్న రైతులే చాలా తక్కువ మంది ఉన్నారని తెలిపారు.

టీకాంగ్రెస్ నేతలకి ఆ మాత్రం కూడా జ్ఞ్యానం కూడా లేకుండా ఇలాంటి హామీలను ఎలా ఇచ్చేస్తున్నారని ప్రశ్నించారు.అదే సందర్భంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన అంటాడు..కెసిఆర్ ను గద్దె దించే వరకు తాను గడ్డం కూడా తీయించుకొనని,అంటున్నారని నువ్వు గడ్డం పెంచుకుంటే మాకేం నష్టం లేదని,ఆ గడ్డం పెంచుకొని సన్యాసుల్లో కలిసిపోతావో లేక పాదాల వరకు పెంచుకుంటే మాకేం నష్టమని వ్యాఖ్యానించారు.అయినా గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కడు గబ్బర్ సింగేనా?అలా పెంచుకొని ప్రతీ ఒక్కడు పవన్ కళ్యాణ్ లా ఫీల్ అయ్యిపోతున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.