డోలు వాయిస్తూ సందడి చేసిన కేటీఆర్!

Sunday, September 2nd, 2018, 06:16:37 PM IST

టీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రగతి నివేదన సభ వద్ద గులాబీ నేతల సందడి మొదలైంది. సభ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. యువ నేతలు కూడా భారీగా తరలిరావడంతో ఫుల్ జోష్ నెలకొంది. అయితే కార్యకర్తలతో యువనేత కేటీఆర్ కూడా సందడి చేశాడు. కళాకారులు ప్రత్యేకంగా నృత్యాలు చేస్తున్న చోటుకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారి నుంచి ఒక డోలు తీసుకొని వాయించారు.

దీంతో పార్టీ శ్రేణులు కూడా కేటీఆర్ తో జతకట్టి అందరిని ఉత్సాహపరిచారు. ముఖ్యంగా కళాకారులైన రసమయి బాలకృష్ణ కేటీఆర్ కు డోలు వాయించడం నేర్పించారు. కేటీఆర్ కొన్ని స్టెప్పులు కూడా వేశారు. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కేటీఆర్ ను పక్కనున్న కార్యకర్తలు భుజాలపై ఎత్తుకొని అభినందించారు. ఇక సభ కోసం ముందు నుంచే కేటీఆర్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. సభకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments