అక్కడ మెగాస్టార్ బొమ్మ చూసి మురిసిపోయిన కేటీఆర్..!

Thursday, January 18th, 2018, 06:57:22 PM IST

దేశం కానీ దేశంలో మనకు తెలిసిన వారి గుర్తులు కనిపిస్తే చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుంది. అలాంటి అనుభూతే తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఎదురైంది. కేటీఆర్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జపాన్ లోని హమామట్సు అనే చిన్న పట్టణంలో కేటీఆర్ పర్యటించారు. ఆ పట్టణంలోని సుజుకి అనే మ్యూజియంని కేటీఆర్ సందర్శించారు.

కాగా ఆ మ్యూజియంలో కేటీఆర్ కు అరుదైన అనుభూతి ఎదురైంది. ఆ మ్యూజియం లో మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఉండడంతో కేటీఆర్ చాలా థ్రిల్ గా ఫీలయ్యారు. జపాన్ దేశం పైగా ఎక్కడో మారుమూల ఓ చిన్నా పట్టణం.. అందులో చిరు బొమ్మ కనిపించడంతో కేటీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే ఆ ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇక్కడ ఎవరి ఫోటోని చూశానో ఊహించగలరా.. మన మెగాస్టార్ చిరంజీవి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.