కేటీఆర్ చేతులమీదుగా ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌ ప్రారంభం…

Wednesday, March 7th, 2018, 03:46:38 AM IST

రాష్ట్రం ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతుంది అనడానికి మరొక నిదర్శనం వరంగల్ లో ప్రారంభించబడిన మరో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌. ఐటీ రంగం అభివృద్ది కార్యాచరణకు నిలువుటద్దం పట్టినట్టుగా మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీస్కుంటున్నాడు. హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడూతూ.. వరంగల్‌ను దేశానికి ఐటీ సెంటర్‌గా తయారు చేయాలి. ఇంక్యుబేషన్ సెంటర్ వరంగల్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గొప్ప అవకాశం కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కూరారు. సామాన్యులకు ఉపయోగపడకపోతే ఎంతటి సాంకేతిక పరిజానమైన వృథానే అని అన్నారు. నవీన ఆవిష్కరణలు కేవలం చదువుకున్న వారికే మాత్రం పరిమితం కాదు. రెండు వేలకు పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు స్టార్టప్‌ల నుంచే వస్తాయి. 2014కు ముందు విద్యా అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించలేదు. డ్రోన్ టెక్నాలజీ కొత్తపరవళ్ళు తొక్కుతోందని కేటీఆర్ అన్నారు. బయో ఆసియా మీట్‌లో మంత్రి కేటీఆర్‌ను రతన్ టాటా ప్రశంసించారని మంత్రి కడియం ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశానికి కేటీఆర్‌లాంటి నేత ఉంటే ఇండియా అమెరికాను దాటిపోతుందని రతన్ టాటా అన్నారని చెప్పారు. కేటీఆర్ నేతృత్వంలో ఐటీ రంగం దూసుకుపోతోందని అన్నారు. యువతకు కావాల్సిన మౌలిక మరియు టెక్నాలజీకి సంబందించిన వసతులు అన్ని వేళలా కలిపిస్తామని, దాన్ని మీరు సక్రమంగా సద్వినియోగపరచుకొని దేశానికి ఉపయోగపడటమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.