అటు చంద్రబాబుతో, ఇటు లోకేష్ తో..అదిరిందయ్యా కేటీఆర్..!

Tuesday, January 23rd, 2018, 06:58:30 PM IST

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలుగు ప్రముఖుల సందడి కనిపించింది. తెలుగు వారికి ఆసక్తి కలిగించే దృశ్యాలు దావోస్ లో దర్శనమిచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం తరుపున కేటీఆర్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొన్నారు. ఇక ఆంద్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి మంత్రి లోకేష్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్ మధ్య సంబంధాలు అంతా మెరుగ్గా ఏమి లేవు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశాంతంగా కూర్చుని చర్చించుకున్న సందర్భాలే చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ దావోస్ లో చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు కలసి దిగిన ఫోటో వైరల్ గా మారింది. చంద్రబాబు, కేటీఆర్ ఇద్దరూ చిరునవ్వుతో కనిపించారు. ఇక నేడు ఏపీ మంత్రి లోకేష్ పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా కేటీఆర్ లోకేష్ తో కూడా భేటీ అయ్యారు. లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ గాలుల జయదేవ్ కూడా కేటీఆర్ తో కనిపించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.