వైరల్ వీడియో పై దిగొచ్చిన కేటీఆర్..!

Tuesday, November 22nd, 2016, 02:03:32 PM IST

viral
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేయడం ప్రస్తుతం సాధారణంగా మారిపోయాయి. తాను టిఆర్ ఎస్ నాయకుడి నంటూ ఇద్దరు వ్యక్తుల్ని ఓ వ్యక్తి చితక బాదుతున్న వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.దీనిపై తెలంగాణ ఐటి శాఖా మంత్రి కేటీఆర్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఓ జర్నలిస్ట్ దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. సదరు వ్యక్తి టిఆర్ ఎస్ పార్టీ సభ్యుడు కాదని వివరణ ఇచ్చాడు.తాను పరపతి గల టిఆర్ ఎస్ నాయకుడిని అని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేస్తున్న వ్యక్తి వీడియో వైరల్ గా మారింది.

సూర్యా పేటకు చెందిన సంతోష్ అనే ఆ వ్యక్తి తాను టిఆర్ ఎస్ నేతని అని, మంత్రి జగదీశ్ రెడ్డికి తాను అనుచరుడిని అని చెప్పుకునే అతడు గత కొంతకాలంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుల వద్ద డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనితో తమకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరిన యువకులను అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, వారిపై దాడి చేస్తున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ అతడు టిఆర్ ఎస్ పార్టీ నేత కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే మరియు మంత్రి అయినా జగదీశ్ రెడ్డి ధృవీకరించారని తెలిపారు. ఈ ఘటన పై చర్య తీసుకోవాలని కేటీఆర్ డిజిపిని విజ్ఞప్తి చేశారు.