కాంగ్రెస్,బీజేపీలు చేసిందేం లేదు పీకిందేం లేదు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Tuesday, October 30th, 2018, 05:00:57 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పార్టీలు విస్తృతంగా వారి పార్టీ యొక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు,ఒక్కో పార్టీకి చెందినటువంటి వారు ఇతర పార్టీల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తెరాస మరియు టీకాంగ్రెస్,బీజేపీల మధ్య ఈ స్థాయి అధికంగా ఉంది.తాజాగా తెరాస ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఎల్లా రెడ్డి ప్రాంతంలోని జరిగినటువంటి ఒక సభలో టీకాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల కమిసన్ కూడా అన్ని పార్టీల వారికి ఆలోచించే గుర్తులు ఇస్తారు ఏమో అంటూ కాంగ్రెస్ పార్టీ వారికి హస్తం(చేయి) గుర్తు ఇచ్చారని మరి గడిచిన ఈ డబ్భై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ వారు కూడా భారత ప్రజానీకానికి మొండి చెయ్యే ఇచ్చారని చురకలంటించారు,ఇక పోతే భారతీయ జనతా పార్టీ వారి గుర్తు ఏమిటి అని అడిగి వారు కూడా ఎన్నో ఏళ్ల నుంచి అందరి చెవుల్లో వారి పార్టీ గుర్తు అయినటువంటి పువ్వునే మోడీ గారు పెట్టి చేసిందేమి లేదు పీకిందేమి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.