టీఆరెస్ నేత కబ్జా విషయంపై కేటీఆర్ సీరియస్

Monday, June 11th, 2018, 03:11:51 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజకీయ నాయకులకు మంచి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. యూత్ కి దగ్గరగా ఉండడానికి నేతలు వారి ట్వీట్స్ తో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అయితే సమస్యలు ఎక్కువగా ట్విట్టర్ లోనే సాల్వ్ చేస్తున్నారు. ఎవ్వరు సమస్యలు చెప్పినా కూడా ప్రభుత్వం తరపున అండగా ఉంటామని సహాయం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక నెటిజన్ టీఆరెస్ నాయకుడు కబ్జా చేశాడంటూ కామెంట్ పెట్టగా కేటిఆర్ స్పందించారు.

కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల లో బీవై నగర్ లో మంగళారపు సువర్ణ అనే మహిళ యొక్క ఖాళీ స్థలాన్ని కేటీఆర్ అండదండలతో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్, సిరిసిల్ల మునిసిపల్ వైస్ చైర్మన్ కనకయ్య అన్యాయంగా కబ్జా చేశాడని ఓ మీడియాలో వచ్చింది. అయితే ఆ లింక్ ను కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ఓ నెటిజన్ తెలియజేయగా ఆయన వెంటనే వార్తను కొట్టి పారేస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు జరిగిన విషయంపై విచారణ జరిపించాలని కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments