అమిత్ షా,మోడీ,రాహుల్ గాంధీలను ఒక ఆట ఆడుకున్న కేటీఆర్..!

Sunday, September 16th, 2018, 04:36:17 PM IST

ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఈ రోజు తెరాస కార్యకర్తలతో జరిగిన ఒక మీటింగులో నరేంద్ర మోడీ,అమిత్ షా మరియు రాహుల్ గాంధీలను ఒక ఆట ఆడుకున్నారు. మరో సారి తనదైన శైలిలో వారి మీద విమర్శల జల్లు కురిపించారు. నిన్న అమిత్ షా ముందస్తు ఎన్నికల కోసం మాట్లాడిన మాటలకు గాను అమిత్ షా గారికి కొన్ని గుర్తుంటున్నాయ్ కొన్ని ఉండట్లేదు అని,ఇప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న వారి పార్టీ యొక్క అదినేత నరేంద్రమోడీ గారు 2002 సంవత్సరంలో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ముందస్తుకు వెళ్ళలేదా అని ప్రశ్నించారు,అలాగే 2004లో వాజపేయి గారు కూడా ముందస్తు వెళ్లారు. వాళ్ళు చేస్తే ఒప్పు కెసిఆర్ గారు చేస్తే తప్పు అవుతుందా అని అడిగారు.అమిత్ షా గారు రెండున్నర కోట్లు ఇచ్చాం అన్నదానికి స్వర్గీయ ఎన్టీఆర్ గారి మాటలను గుర్తు చేస్తూ రాష్ట్రాలు లేనిది కేంద్రం ఎలా ఉంటుంది అని,అన్ని రాష్ట్రాలు కలిపి పన్ను కడితేనే అక్కడ కేంద్రం ఉంది అని తెలిపారు.ఐనా భారతదేశం లో అత్యధిక పనులు కడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణా కూడా ఒకటని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ గారి కోసం మాట్లాడుతూ ఆయన పెద్ద నోట్లు రద్దుతో అది చేస్తాం అసలు దేశం లో నల్ల డబ్బు లేకుండా చేస్తాం ఆ డబ్బు అంతా పేదల అకౌంట్లలో 15 లక్షల చొప్పున వేస్తాం అన్నారు అలా ఎంత మందికి వేసారో తెలపమన్నారు.మధ్యతరగతి వాళ్ళు వారి డబ్బును వారి బ్యాంకు అకౌంట్లలోనుంచి తీసుకోడానికి ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో తెలుసుకోమన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలను మోసం చేసిన “భారతీయ జూటా పార్టీ” అని కేటీఆర్ విమర్శించారు.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. మరి ఏం చేశారు అంటే ప్రతి ఒక్కరి చేతికి చీపురు ఇచ్చి స్వచ్ఛ భారత్ అన్నారు తప్ప చేసింది ఏమి లేదు అన్నారు.

ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతూ వారి యొక్క పరిస్థితి అటు కేంద్రంలోను బాలేదు అని ఇటు రాష్ట్రంలోను బాలేదని తెలిపారు.రాహుల్ గాంధీ యొక్క పరిస్థితిని చూస్తే చాలా అద్వాన పరిస్థిలో ఉంది అని,ఆయన గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది అని కాంగ్రెస్ గెలుస్తుందని అక్కడ మన రాహుల్ బాబా కాలు పెట్టగానే కాంగ్రెస్ ఓడిపోయింది అని తెలిపారు, అదే తరహాలో కర్నాటకాలో కూడా కాంగ్రెస్ నెగ్గుతుంది అని తెలిపి కాలు పెట్టగానే అక్కడకూడా ఓడిపోయింది అని చురకలు అంటించారు.తెలంగాణలో ఆయన బలమైన చోటే వారి అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు.అలాంటిది వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ జెండా పాతుతారా అని ఎద్దేవా చేశారు.ఈ విధంగా ఒకేసారి ముగ్గురుని కేటీఆర్ ఒక ఆట ఆడుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments