రాబందుల్లా రైతులను పీక్కుతిన్న టీకాంగ్రెస్,టీడీపీ లకు ఓటేస్తారా.?కేటీఆర్!

Wednesday, October 24th, 2018, 12:02:23 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి ఎన్నికల వేడి పెరిగి పోతుంది. దీంతో ఒక్కొక్క పార్టీ వారి యొక్క వ్యూహాలను పదును పెడుతున్నారు. అదే సందర్భంలో వారి యొక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా వేగవంతం చేశారు.అక్కడ టీ కాంగ్రెస్ మరియు తెలంగాణ పార్టీల వారు ఎవరో ఒకరి మీద ఒకరు తీవ్ర మాటలు యుద్ధం చేసుకుంటున్నారు.ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ టీ కాంగ్రెస్ నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలోని నాలుగు పార్టీలు రోజువారీ పార్టీ మీటింగ్ లో టీ లు బిస్కెట్లు తినడానికి వరకు సమయం సరిపోవటం లేదని వారు స్వీట్లు పంచుకుని లోపు మేము ఎక్కడ గెలిచి స్వీట్లు కూడా పంచేసుకుంటామని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

గత 67 ఏళ్లుగా నీళ్లు కరెంటు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ఆ రెండు పార్టీలు కావాలా? లేక కేవలం ఈ నాలుగేళ్లలో 24 గంటల పాటు నీళ్లు కరెంటు ఇచ్చిన కెసిఆర్ గారి నాయకత్వం కావాలా అని ప్రశ్నించారు అంతేకాకుండా ఆనాడు పలు ప్రాంతాల్లో టీ కాంగ్రెస్ మరియు టిడిపి పార్టీలు కలిసి ఇక్కడి రైతులను కాల్చి చంపించారని,ఇప్పుడు ఈ ఇద్దరు తోడు దొంగలు ఇప్పుడు ఒక్కటయ్యి ఎన్నికల బరిలోకి దిగుతున్నారని, మండిపడ్డారు. రైతులను రాబందుల్లా కాల్చుకుతిన్న వారు ఒక పక్క ఉన్నారని రైతుబంధు వంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టిన కెసిఆర్ మరోపక్క ఉన్నారని మరి అలాంటి వాళ్లకి ఓటు వేస్తారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలని కేటీఆర్ మనవి చేసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments