టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే జనం రాళ్లతో కొడతారు..!

Wednesday, September 26th, 2018, 12:38:47 PM IST


తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపధ్యంలో తెరాస పార్టీని ఓడించడానికి తెలంగాణలోని బీజేపీ పార్టీ మినహా అన్ని పార్టీలు పొత్తులా కాకుండా మహాకూటమి పేరిట కలిసి పోటీకి దిగుతున్నారన్న సంగతి తెలిసినదే.అయితే ఈ మహా కూటములు పొత్తుల పట్ల తీవ్ర విమర్శల పాలవుతున్నారు,అందులో ముఖ్యమైన పార్టీలు చూసుకున్నట్టయితే తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీలు కనిపిస్తున్నాయి.ఈ రెండు పార్టీల కలయిక పట్ల తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ తెలంగాణలోని తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీల కలయిక మీద మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తాను తెలుగుదేశం అనే పార్టీను కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికీ పట్టిన శని అని ఆ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు విపత్కర పరిస్థితి వచ్చిందని,అలా ఆవిర్భవించిన పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు బట్టలూడదీసి రాళ్లతో కొడతారని,ఈ మాట తాను అనలేదని వారి పార్టీ యొక్క ఆంధ్రప్రదేశ్ నాయకులు చినరాజప్ప,అయ్యన్నపాత్రుడు గార్లు అన్నారని సెలవిచ్చారు,తెలంగాణలోని ప్రొఫిసర్ కోందండరాం గారు అమరుల ఆకాంక్ష ప్రాతిపాదికనే పొత్తు పెట్టుకుంటున్నాం అన్నదానికి, ఆ అమర వీరుల యొక్క కుటుంబానికి సంబందించి ఎవరు వచ్చి పార్టీలతో పొత్తు పెట్టుకొమ్మని అడిగారని ప్రశ్నించారు.టీడీపీ కాంగ్రెస్ వల్ల ఇప్పటివరకు ఎన్నో అనర్ధాలు జరిగాయని మళ్ళీ వారే అధికారంలోకి వస్తే ఈ రైతన్నలకు కన్నీళ్లను మిగుల్చుతారని పేర్కొన్నారు.