వైరల్ : కేటీఆర్ జిల్లాలో రైలు స్కూలు చూశారా

Saturday, July 28th, 2018, 12:25:09 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనకు యువతకు మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా మారుతోంది. ఎప్పటికప్పుడు సమస్యలను ట్విట్టర్ లోనే పరిష్కారం అయ్యేలా నమ్మకాన్ని కలిగిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇకపోతే రీసెంట్ గా కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన నియోజకవర్గమైన సిరిసిల్ల లోని ఒక స్కూల్ ఇలా ఉందంటూ పోటోలను షేర్ చేశారు. స్కూల్ ను చూస్తుంటే చాలా కొత్త్తగా అనిపిస్తోంది. సడన్ గా చుస్తే రైలులో విద్యార్థులు ఉన్నారా? అని అనిపిస్తోంది. ఆ విధంగా కళాకృతితో రంగులు వేసిన స్కూల్ ఫొటోలు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

  •  
  •  
  •  
  •  

Comments