కేటీఆర్ కి ఝలక్ – చెరువు కబ్జాపై ప్రశ్నించిన స్థానికుడు…

Wednesday, January 9th, 2019, 04:45:10 PM IST

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ తన పనులన్నీ కూడా ఎంతో బాధ్యతాయుతంగా చేసుకుంటూ పోతున్నాడు. ప్రజల యొక్క సమస్యలపైన చాలా వేగంగా స్పందిస్తూ వారి యొక్క కష్టాలని తీరుస్తున్నాడు కేటీఆర్. నిరంతరం సామజిక మాంద్యమాల్లో చురుకుగా ఉండే కేటీఆర్, ఒక సామాన్యుడు వేసిన ప్రశ్నకి స్పందించారు. బోడి వెంకట్ అనే స్థానికుడు మేడ్చల్ జిల్లా కీసరలోని నగరం లోని చెరువు అన్నరాయిని, చెరువు కబ్జా అంశాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.

ఆయన కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్ట్ లో “అయ్యా, మా గోడు వినిపించదా మీకు. మేము ఏమి చేయం.. మీడియాలో , పేపరులో రాయిస్తాం అంతే.. అని అనుకోవాలా చెప్పండి. ఇవ్వాళ ఎవ్వడో వచ్చి … ప్రభుత్వం నాకు చెరువులో 2 ఎకరాలు ఇచింది అంటూ చెరువులో పెద్ద పెద్ద లారీలో మట్టి తెచ్చి చెరువు పూడుస్తున్నాడు. దీనిపై స్పందించండి” అంటూ ప్రశ్నించాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. మేడ్చల్ జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోండి అంటూ రీట్వీట్ చేశారు. అంతేకాకుండా చెరువు పాడైపోతుందని, కబ్జాకు గురవుతుందని గతంలోనే కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే ఈ పనిచేయగలం అని మేడ్చల్ డీఐఓ తెలిపారు. నెలలు గడుస్తున్నా ఫలితం కనిపించడం లేదని.. చెరువు పాడైపోవడమే కాదు.. కబ్జా అవుతోందని స్థానికుడు చెప్పడంతో… కేటీఆర్ అధికారులను ఆదేశించారు.