తెలుగుదేశం ,తెరాస కలిసి ఉండాలని చంద్రబాబు నన్ను అడిగారు..కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు!

Sunday, October 28th, 2018, 06:36:52 PM IST

తెలంగాణా రాష్ట్రంలో చంద్రబాబు మరియి కెసిఆర్ లకు మధ్య సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు లేవని అందరికి తెలుసు.గత కొద్ది రోజుల నుంచి కూడా కెసిఆర్ చంద్రబాబు మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో కూడా అందరికి తెలుసు.కెసిఆర్ తరహా లోనే ఆయన తనయుడు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు ని విమర్శించారు.అయితే ఈ రోజు హైదరాబాద్ లోని జరిగినటువంటి ఒక మీటింగులు కేటీఆర్ చంద్రబాబు నాయుడు తో ఈ మాధ్య జరిగిన కలయికలో వారు మాట్లాడుకున్న కొన్ని ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు.

నల్గొండ జిల్లాలోని నందమూరి హరికృష్ణ గారు దురదృష్టవశాత్తు చనిపోతే వారి పార్టీకి చెందినటువంటి జగదీష్ రెడ్డి గారు అక్కడికి చేరుకొని ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాదుకు చేర్చగా వారికి కుటుంబానికి సంతాపం తెలుపడానికి తాను మరియు కెసిఆర్ కూడా వెళ్లిన సందర్భంలో చంద్రబాబు వారితో మనం కలిసి ఉంటే బాగుంటుందేమో,తెలుగుదేశం మరియు తెరాస పార్టీలు మళ్ళీ కలవాలని ఆయన కోరారని కేటీఆర్ తెలిపారు.

దానికి గాను కేటీఆర్ ఈ చర్య సాధ్యపడదు అని తెలుపగా బాబు గారు ఎందుకని అడిగారని,దానికి సమాధానంగా మీరు ఎప్పుడో మీ చర్యల ద్వారా ఇక మీ భవిష్యత్తు అంతా ఆంధ్ర రాష్ట్రంలోనే అని తెలిపారని,జగన్మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ లు ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రం మీదే దృష్టి పెడితే మీ ఒక్కరు మాత్రం ఇంకా తెలంగాణలోని తెరాస తెలుగుదేశం కలిసి ఉండాలని కోరుకుంటున్నారని మరి అలాంటాప్పుడు ఖచ్చితంగా వైరుధ్యాలు వస్తాయని తెలిపానని అన్నారు.ఇలాంటి వైరుధ్యాలతో పొత్తులు కుదరవు ఒకవేళ కలిసి ఉంటే ఏదొక రోజు గొడవలు రాగానే వస్తాయని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments