కేటీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్స్ టూ ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Tuesday, September 25th, 2018, 10:03:42 AM IST

తెలంగాణా ముందస్తు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కోరి మీద విమర్శలు వ్యంగ్యాస్త్రాల జల్లు కురిపిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస పార్టీలలో అయితే ఇది మరీ ఎక్కువగానే ఉంది అని చెప్పాలి.తెరాస ప్రభుత్వాన్ని ఎలా అయినా సరే గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీ శత విధాలా ప్రయత్నిస్తుంది.అదే బాటలో కూడా తెరాస ప్రవేశ పెట్టిన మానిఫెస్టోకు ధీటుగా వారి మానిఫెస్టోని కూడా తయారు చేసింది.ఇప్పుడు వీరి మానిఫెస్టో మీద ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఒక్క లెక్కలో కాంగ్రెస్ నాయకులను ఆడుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ యొక్క మానిఫెస్టో మీద మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వారు మేము ఏది చేస్తాం అంటే వారు దాన్ని రెట్టింపు చేస్తాం అంటూ అబద్ధపు హామీలు ఇస్తున్నారని,మేము పింఛను 1500 ఇస్తామంటే వారు 3000 ఇస్తాం అంటున్నారని,ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉంటే,మీ పార్టీకంటూ ఒక పరువు ఉంటే మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇవన్నీ ఒకసారి చేసి చూపించండి అని ప్రశ్నించారు,అంతే కాకుండా ఇంకాస్త వెటకారాన్ని జోడించి,ఒకవేళ తెలంగాణలో ఎవరికైనా పెళ్లి కాకపోతే పిల్లని కూడా మేమె చూస్తాం,ఒకవేళ మీకు వంట రాకపోతే మీకు మూడు పూట్ల కూడా మేమె వండి పెడతాం,ఒకవేళ మీకు తినడం రాకపోతే మేమె గోరు ముద్దలు తినిపిస్తాం,మీకు పిల్లలు పుడితే వాళ్లకి డైపర్లు కూడా మారుస్తాం అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారని,కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తనదైన శైలిలో చురకలు అంటించారు.