ఒకే దెబ్బకు రెండు పార్టీలు చిత్తు: కేటీఆర్ కౌంటర్

Thursday, September 13th, 2018, 04:02:52 AM IST


రాజకీయాల్లో కీలక సమయాల్లో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తుకు మార్గం చూపిస్తుంది. టీఆరెస్ పార్టీ తీసుకున్న ముందస్తు ఎన్నికల వ్యూహం ఆ పార్టీకి ఎలాంటి దారిని చూపిస్తుందా అనేది జాతీయ మీడియాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఇదే అవకాశంగా బావించిన ప్రతిపక్షాలు అందరూ ఉహించనట్టుగానే మహాకూటమిగా ఏర్పడుతున్నారు. ముఖ్యంగా ఒకప్పటి శత్రువులైన కాంగ్రెస్ టీడీపీ లు ఒకటవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇకపోతే ఇది టీఆరెస్ కు లాభమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. రీసెంట్ గా మంత్రి కేటీఆర్ కూడా ఈ పోత్తుపై ఆకట్టుకునే విధంగా వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లు కలవడం నిజంగా ఒక జుగుప్సాకరమైన విషయం. తెలంగాణకు అడ్డుపడిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయి. ఈ ఇద్దరు కలవడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలనే విషయంలో ప్రజలకు క్లియర్ ఛాయిస్ లభించింది. ఒకే దెబ్బతో రెండు పార్టీలను చిత్తు చేసే అవకాశం తమకు లభించిందని కేటీఆర్ తెలిపారు. అదే విధంగా తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీలు కావాలో, టీఆర్ఎస్ కావాలో నిర్ణయించాల్సిన సమయం ఇదేనని స్పష్టమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందు ఉందని వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments