చంద్రబాబు,టీకాంగ్రెస్ లకు దిమ్మతిరిగిపోయే కౌంటర్లిచ్చిన కేటీఆర్.!

Wednesday, October 10th, 2018, 10:20:21 PM IST

కొన్ని రోజుల వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మళ్ళీ తన విమర్శాస్త్రాలను సంధించారు.ఈ సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు తెలంగాణలో ఉన్నటువంటి టీకాంగ్రెస్ పైన విరుచుకుపడ్డారు.ఈ వ్యాఖ్యలను చూస్తుంటే ఈ సారి తన విమర్శల స్థాయిలో తీవ్రతని పెంచారనే చెప్పాలి.ఒకప్పుడు 200 పెన్షన్ ఇవ్వడానికే నానా తంటాలు పడిన వాళ్ళు ఇప్పుడు 2000 ఇస్తానంటున్నారని,ఇలాంటి దొంగ హామీలు ఎన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మరని తెలిపారు.

ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక సభలో మహాకూటమికిగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేసారు.ప్రస్తుతం మనకి ఏ మాత్రం సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి తెలంగాణా రాష్ట్రానికి నీళ్లివ్వద్దంటూ 30 లేఖలు రాసారని,ఒకానొక సందర్భంలో ఐతే అసలు తెలంగాణా రాష్ట్ర భూములు వ్యవసాయానికి పనికిరావారని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలే పత్రికలో లో కూడా రాసారని తెలిపారు.అలాంటి చంద్రబాబు నాయుడు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తో కలిసి ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతున్నారని మొదటి నుంచి తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చెయ్యాలని చూస్తున్న వీరు అధికారంలోకి వస్తే ఇక్కడి తెలంగాణా రాష్ట్రాల్లోకి నీళ్లు రానిస్తారా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు చేసినటువంటి ఈ పనికి నందమూరి తారక రామారావు గారి ఆత్మ బాధపడుతుంది పేర్కొన్నారు.తెలంగాణా సాధించుకున్న తర్వాత తర్వాత కూడా మనం ఢిల్లీకి గులాములుగా ఉందామా లేక సింహం లాంటి కెసిఆర్ కు అండగా ఉందామా అని ప్రశ్నించారు.ఢిల్లీ నుంచి ఊడిపడే గులాములు,చంద్రబాబు యొక్క పాద దాసులు వల్ల తెలంగాణాకు ఎప్పటికి న్యాయం జరగదని,దిమ్మతిరిగిపోయే కౌంటర్లు ఇచ్చారు.