బాబు ఫోకస్ అక్కడే పెట్టుకుంటే మంచిది..! – కేటీఅర్

Friday, November 9th, 2018, 12:53:50 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కేటీఆర్ వైఖరి విచిత్రంగా ఉంటుంది, ఒకసారి సైబరాబాద్ రూపకర్త చంద్రబాబే అని ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్బానికి ఎటువంటి సంబంధం లేదని, ఆ క్రెడిట్ అంత ఆయనకే దక్కుతుందంటూ పొగిడేస్తారు, ఇంకోసారి చంద్రభాను మీద చమత్కారంగా పంచులు విసురుతారు. ఈ తీరు తెరాస శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీని వెనక కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఉండనే చెప్పాలి, ఒక పక్క చంద్రబాబు సానుభూతి పరుల ఓట్లను దక్కించుకుంటేనే, మరో పక్క బాబు వ్యతిరేక ఓటు బ్యాంకు ను కూడా వదులుకోకూడదని ఆయన ఉద్దేశం లా అనిపిస్తుంది.

తాజాగా తెలంగాణ బ్రాహ్మణ సమాజ నేతల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఏపీ మాజీ సీఎస్ ఐ.వై.ర్ కృష్ణమూర్తి పేరును వాడుకొని చందరబాబు ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. “చంద్రబాబు కు ఆంధ్రప్రదేశ్ లో చాలా విషయాలున్నాయి, ఆయన ఫోకస్ అక్కడ పెడితే బాగుంటుందని, తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే మంచిది కాదని చెప్పారు. ఆ రకంగా బాబు విషయంలో చమత్కరించినా, సందర్భానుసారం గట్టిగానే విమర్శిస్తాడు. ఐ. వై.ఆర్ కృష్ణమూర్తి సీఎస్ గా పని చేసి విరామం పొందిన తర్వాత బ్రాహ్మణా సమాజానికి అధ్యక్షుడుగా నియమించి తర్వాత అవమానించారని బ్రాహ్మణ సమాజ నేతలకు గుర్తు చేసారు. అలాగే కెసిఆర్ ప్రభుత్వం బ్రాహ్మణా సమాజ సంక్షేమం కోసం చేసిన మేలు గురించి కూడా సెలవిచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments