కేటీఆర్ ఖతర్నాక్ జోక్.. లేడీస్ తప్పుగా అర్ధం చేసుకోవద్దు!!

Saturday, October 28th, 2017, 06:16:00 PM IST

తెలంగాణ టీఆరెస్ పార్టీ ముఖ్యనేత, మంత్రి కేటీఆర్ ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడు ఎలాంటీ ఘటనలు జరిగినా స్పందిస్తూ ఉంటారు. అంతే కాకుండా సామస్యలపై ఎవరు ట్వీట్ చేసినా సరే తనదైన శైలిలో ఆ విషయాన్ని సాల్వ్ చేసేలా చూస్తారు. ప్రస్తుతం కేటీఆర్ కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ముఖ్యంగా యువతలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

అయితే ఎవరు ఊహించని విధంగా కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక జోక్ ని పోస్ట్ చేశారు. ఎవరు ఆ జోక్ గురించి తెలుసుకున్నా నవ్వకుండా ఉండలేరు. కేటీఆర్ కూడా ఈ జోక్ ని గురించి మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాఅని కామెంట్ చేస్తూ ఆ జోక్ పిక్ ని పోస్ట్ చేశారు. ముఖ్యంగా మహిళలు తప్పుగా అర్ధం చేసుకోవద్దని రిక్వెస్ట్ చేశాడు. ఆ జోక్ ఏమిటంటే.. ఒక వ్యక్తి గురూజీ నా తప్పులను నేను ఎలా తెలుసుకోవాలని అన్న ప్రశ్నకు ఐ పాయ్ బాబా ఈ విధంగా సమాధానం చెబుతాడు. నీ భార్య చేసిన ఒక తప్పును గురించి తెలుసుకొని ఆమెను సరిదిద్దుకొమ్మని చెప్పు. ఆ తర్వాత ని తప్పులే కాదు ని కుటుంబం తప్పులతో పాటు బంధువుల తప్పులు ని స్నేహితుల తప్పులు కూడా ఆమె ద్వారా ఈజీగా తెలుస్తాయని బాబా చెబుతాడు. ఈ జోక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.