జ్వరంతో బాధపడుతున్నా.. కేటీఆర్ బర్త్ డే ట్వీట్!

Tuesday, July 24th, 2018, 10:43:59 AM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ప్రస్తుతం సోషల్ మీడియాలో బర్త్ డే విషెష్ ఓ రేంజ్ లో అందుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలెబ్రెటీల వరకు చాలా మంది గ్రేట్ లీడర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇక కేటీఆర్ కూడా అందరికి సమానంగా కృతజ్ఞతలు చెబుతుండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేటీఆర్ కు గతకొంత కాలంగా యువత నుంచి కూడా మంచి ఫాలోయింగ్ పెరుగుతోంది.

ముఖ్యంగా ఆయన మాట్లాడేవిధానం చాలా మందికి నచ్చుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే కేటీఆర్ తన పుట్టినరోజు అందరిని కలవలేకపోతున్నాను అంటూ కొంచెం జ్వరం కారణంగా బాధపడుతున్నట్లు చెప్పారు. బహుశా వయసురీత్యా అయ్యి ఉండవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే తన పుట్టినరోజు ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయకుండా ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపండి. కేక్ కట్ చేసే బదులు ఒక మొక్కని నాటండి చాలు అంటూ కేటీఆర్ వివరణ ఇచ్చాడు. మహేష్ బాబు తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా కేటీఆర్ కు బర్త్ డే విషెస్ ను అందించారు.

  •  
  •  
  •  
  •  

Comments