భారత క్రికెటర్ ఇన్స్టాగ్రామ్ లో అశ్లీల ఫొటోలు!

Wednesday, February 21st, 2018, 02:06:03 PM IST


ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల దాడులు మరి ఎక్కువైపోయాయి. టాప్ సెలబ్రెటీల సోషల్ మీడియా ఎకౌంట్స్ ను హ్యాక్ చేసి ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తున్నారు. ఎక్కువగా అసభ్యకర పోటోలను పోస్ట్ చేసి వారికి లేని పోనీ తలనొప్పులు తెస్తున్నారు. రీసెంట్ గా భారత క్రికెటర్ కుల్ డీప్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి అందరిని షాక్ కి గురి చేశారు. కుల్ డీప్ కు 3 లక్షలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఎకౌంట్ నుంచి సడన్ గా అశ్లిల ఫొటోలు కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

కుల్ ధీప్ ఇలాంటి ఫొటోలు ఎందుకు పోస్ట్ చేశాడని సోషల్ మీడియాలో చాలా రకాలుగా కామెంట్స్ వినిపించాయి. అయితే విషయం తెలుసుకున్న కూల్ దీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నా ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. దయచేసి అభిమానులు అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా అని వివరణ ఇచ్చాడు. అయితే ఇదే తరహాలో కొంత మంది బాలీవుడ్ తరాల ట్విట్టర్ ఎకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయి. కొందరి ఎకౌంట్స్ లో అయితే ఏకంగా అశ్లిల వీడియోలు ఎక్కువగా దర్శనం ఇచ్చాయి. ఆ దెబ్బతో కొందరు సోషల్ మీడియాలోకి రావద్దని గట్టిగా నిర్ణయించుకున్నారు.