విరాట్ ఆర్మీలో ధోని జనరల్!

Tuesday, March 6th, 2018, 12:07:50 PM IST

ప్రస్తుతం భారత జట్టులో కెప్టెన్ విరాట్ అయినా కూడా మాజీ కెప్టెన్ ధోనిలో ఇంకా నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇప్పటికి బౌలర్లకు సలహాలు ఇస్తూ.. భయంకర బ్యాట్స్ మెన్ లను ఎలా బయటకి పంపించాలో ప్లాన్ వేస్తుంటాడు. బౌలర్స్ లో ఉత్సాహాన్ని ఎలా నింపాలో ధోనికి బాగా తెలుసు. వికెట్ల మైక్ ద్వారా మనకు ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. విరాట్ కోహ్లీ ఆర్మీలో ధోని జనరల్ లాగా బాధ్యతలను తీసుకుంటాడు. అదే విషయాన్ని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తెలిపాడు. ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతిలో ఉన్న ఈ యువ స్పిన్నర్ ఐపీఎల్ కోసం సిద్దమవుతున్నాడు.

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని గురించికా కొన్ని విషయాలను తెలిపాడు. విరాట్ ఆర్మీలో ధోని జనరల్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా జట్టు సబ్యులకు ఉత్తేజాన్ని నింపడంలో ధోని ముందుంటాడు. పరిస్థితిని అర్ధం చేసుకొని బౌలర్లలో ఆత్మవిశ్వసాన్ని నింపుతారు. విరాట్ తో కలిసి మ్యాచ్ కి ముందు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. దక్షిణాఫ్రికా టూర్ విజయవంత అవ్వడానికి కారణం ధోని విరాట్ ఆలోచనలే. కోహ్లీ ఒత్తిడికి లోను మైదానంలో బౌలర్లకు ఎక్కువగా స్వేచ్ఛను ఇస్తుంటారు. అందుకే నేను వికెట్ల కోసం కాకుండా ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తా. ప్రత్యర్థి ప్లేయర్ ని ఒత్తిడికి గురి చేస్తే వికెట్లు అవే దక్కుతాయి. కోహ్లీ – ధోని బ్యాటింగ్ చాలా వేగంగా ఉంటుంది. ప్రస్తుతం నా ద్రుష్టి ఐపీఎల్ లో వారిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం పైనే ఉందని కుల్దీప్ నవ్వుతూ చెప్పాడు.