కెసిఆర్ పై ఘాటైన విమర్శలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Saturday, October 6th, 2018, 03:53:26 AM IST


తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలకు ఎంతో సమయం లేదు.దీనితో ఒక్కో పార్టీ వారు ఇతర పార్టీల వారి వైఫల్యాలను ప్రజలలో బట్టబయలు చెయ్యడానికి ఎన్నికల ప్రచారాలు,భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లో మమేకం అవుతున్నారు.ఈ మధ్యనే తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ భారీ బహిరంగ సభలకు పిలుపునిచ్చి ఒక్కో రాజకీయ పార్టీ నాయకులను ఎండగడుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పై కెసిఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను వారి పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కెసిఆర్ మీద ఘాటైన విమర్శలు చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కెసిఆర్ ని ప్రజలెవరూ నమ్మటం లేదని,కెసిఆర్ మంచితనం అనే ముసుగు వేసుకొని ఇప్పటి వరకు ప్రజలని మోసం చేశారని ఇప్పుడు కెసిఆర్ నిజ స్వరూపం బట్టబయలయ్యిందని తెలిపారు.అంతే కాకుండా మహా కూటమి వల్ల తనకి ఏ నష్టం జరగదని చెప్పుకున్న కెసిఆర్ ఇప్పుడు అదే కూటమిని చూసి ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.కెసిఆర్ పాలన నుంచి ప్రజలు ఇప్పుడు విముక్తి కోరుకుంటున్నారని,దొంగతనంగా ద్రావణాలు పుచ్చుకొని దీక్షలు చేసి కెసిఆర్ తెలంగాణా సాధించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.