కర్ణాటక సీఎం గా కుమార స్వామి ఎన్నిక లాంఛనమే!

Sunday, May 20th, 2018, 10:11:08 AM IST

కర్ణాటక ఎన్నికలు మొత్తానికి రకరకాల మలుపులు తిరిగి చివరకు నిన్న దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నాలుగు రోజుల క్రితం గవర్నర్ వాజు భాయ్ కాంగ్రెస్, జేడీఎస్ లు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరగా ఆయన అత్యధిక సీట్లు సాధించిన బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం పెద్ద చర్చనీయాంశమైంది. తరువాత యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణం చేయించడం బలనిరూపణకు 15 రోజులు సమయం ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై సుప్రీమ్ కోర్ట్ లో వ్యాజ్యం వేయగా స్పందించిన సుప్రీమ్ కోర్ట్ యడ్యూరప్పకు శనివారం సాయంత్రం 4 గంటలవరకు మాత్రమే బలనిరూపణకు గడువు ఇచ్చింది. అయితే చివరకు నిన్న అసెంబ్లీ వెదికగా తన బలాన్ని నిరూపించుకోలేని యెడ్యూరప్ప రాజీనామా చేసారు. తదనంతరం గవర్నర్ కాంగ్రెస్, జేడీఎస్ లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలికారు. కాగా నిన్న రాత్రి గవర్నర్ తో సమావేశం అనంతరం జేడీఎస్ పార్టీ అధినేత కుమారస్వామి మాట్లాడుతూ, తమ పార్టీ వారిని ఈడీ, సీబీఐ తదితర న్యాయసంస్థలతో కుమ్మక్కయిన కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ ఎమ్యెల్యే లను భయపెట్ట చూచిందని, అయినప్పటికీ తాము భయపడకుండా తమ పార్టీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.

అయితే రేపు సోమవారం మధ్యాహ్నం సమయంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీరానికి ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెంగళూరు లోని కంఠీరవ మైదానంలో ఈ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని తెలుస్తోంది. కాగ్ ఈ వేడుకకు పలువురు ముఖ్య అతిధులు హారాజారవుతున్నలు సమాచారం. ఏపీ, తెలంగాణాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తదితరులను ఆహ్వానించనున్నారట. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే చాలా రోజుల తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చాల రోజుల తర్వాత ఒకేవేదికపై చూడబోతున్నాం……

  •  
  •  
  •  
  •  

Comments