వైసిపిలో చేరిన కర్నూలు మాజీ ఎమ్యెల్యే!

Sunday, April 29th, 2018, 10:12:00 PM IST

ఒకపక్క సార్వత్రిక ఎన్నికలకు సమయం రోజురోజుకు దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో చేరతాడో అనేది చెప్పడం కష్టంగా మారింది. ఇప్పటికే కొందరు నేతలు వైసిపి నుండి టిడిపి కి, టిడిపి నుండి వైసిపికి చేరడం చూస్తున్నాం. కాగా నేడు ప్రస్తుతం కృష్ణ జిల్లా లో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ని కనుమూరి వద్ద కలుసుని పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు కర్నూలు జిల్లా మాజీ ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కాగా ఆయనను జగన్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు వందలాదిమంది అఆయన అనుచరులుకూడా పార్టీలో చేరారు.

కాగా గతకొద్దిరోజుల క్రితంనుండే తన అనుచరులతో సమావేశమైన కాటసాని ఏ పార్టీలో చెరలో వారితో కలిసి సమాలోచనలు చేసి నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో దివంగత ప్రియతమా నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి నడవడం తన అదృష్టమని, పార్టీ గెలుపు కోసం తనవంతుగా శ్రమించి కృషి చేస్తానని ఆయన అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments