పోల‌వ‌రం పూర్తిచేస్తే బాబుకు సాష్టాంగ‌ప‌డ‌తా!

Tuesday, September 20th, 2016, 09:27:32 AM IST

CHANDRABABU-KVP
ఇటీవ‌ల కాలంలో విప‌క్ష నేత‌లు అధికార ప‌క్షంపై చేస్తున్న కామెంట్లు చిత్ర‌విచిత్రంగా ఉంటున్నాయి. వాటిని స‌వాళ్లు అనుకోవాలో తెలియ‌దు. లేదంటే సీరియ‌స్ గా వార్నింగ్ ఇస్తున్నార‌ని అనుకోవాలో అర్ధం కాదు. ఆ మ‌ధ్య తెలంగాణ రాష్ట్ర‌ సీఏం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జారారెడ్డి ఓ కామెంట్ చేశారు. మిష‌న్ భ‌గీర‌థ ను పూర్తి చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తేరాస‌కు ఫ్రీగా ప‌బ్లిసిటీ చేసిపెడతాన‌ని మాటిచ్చాడు. ఈ మాట‌లు మ‌నసులోంచి ఊడిప‌డ్డాయో లేక పెదాల అంచు నుంచి ఊడిప‌డిన‌వో తెలియ‌దుగానీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తాజాగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వెఎస్సార్ ఆత్మ , కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను..చంద్ర‌బాబును ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

2018 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను చంద్ర‌బాబు పూర్తిచేస్తే ఆయ‌న‌కు సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తా. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో కేంద్రం నిధులు ఇవ్వ‌డం క‌ష్టం. అందుకే ఆ బాధ్య‌త‌ల్ని తెలివిగా రాష్ట్రంపై ప‌డేసింది. నిధులు లేకుండా ప్రాజెక్టుల‌ను పూర్తిచేస్తామ‌ని బాబు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతున్నారని ఎద్దేవా చేశారు. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా..అధికార ప‌క్షంలో ఉన్న ప్పుడు మ‌రోలా ఊస‌ల వెల్లిలా రంగులు మార్చే టైపు. మా ప్ర‌భుత్వంలో పోల‌వ‌రం ప్రాజెక్ట్ త‌ల‌పెట్టిన‌ప్పుడు బాబు అడుగ‌డుగునా అడ్డుప‌డిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయ‌ని విమ‌ర్శించారు పెద్దాయ‌న‌.