హైదరాబాద్ లో యువతి అదృశ్యం!

Wednesday, May 16th, 2018, 02:11:37 PM IST

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ, భద్రత లేకుండా పోతుంది అనడానికి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలే రుజువు. కాగా ఈ నెలలో జరిగిన ఒక మహిళా అదృశ్యం ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోని రామచంద్రపురం ప్రాంతానికి చెందిన యువతి 24ఏళ్ళ శ్రావణికి ఇటీవల స్థానిక నరేష్ వర్మతో కొద్దిరోజుల క్రితం వివాహం జరిగిది. అయితే గత నెలాఖరున ఉద్యోగ ప్రయత్నం కోసం హైదరాబాద్ వచ్చిన శ్రావణి, ఒక కంపెనీ లో ఇంటర్వ్యూ కి అటెండ్ అయింది.

ఇంటర్వ్యూ పూర్తికాగానే ఈనెల 1వ తేదీన భీమవరానికి తిరుగుపయనమయిందని, ఆరోజు తనను ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద దించివెళ్లానని ఆమె స్నేహితురాలు చెపుతోంది. అయితే ఆ తర్వాత రెండు మూడు రోజులు గడిచినా ఆమె ఇంటికి చేరుకోకపోవడం, ఎన్ని సార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ చేసిన ఉండడంతో అనుమానం వచ్చిన నరేష్ వర్మ ఆమె స్నేహితురాలికి ఫోన్ చేయడంతో రెండు రోజుల క్రితమే శ్రావణి భీమవరం బయలుదేరిందని చెప్పడంతో షాక్ తిన్న నరేష్ శ్రావణి సోదరుడితో కలిసి ఆమె మిస్సింగ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అతిత్వరలో ఆమె ఆచూకీ కనిపెడతామని అంటున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments