పేరుకేమో ప్ర‌ముఖ న‌టుడు.. చీక‌టి ప‌డితే అత‌ని లీల‌లు మాత్రం వేర‌యా..!

Tuesday, October 9th, 2018, 06:45:50 PM IST

రంగుల ప్ర‌పంచంలో కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం పెద్ద ర‌చ్చే లేపుతోంది. గ‌త ఏడాది సుచిత్రా లీక్స్ అంటూ త‌మిళ ఇండ‌స్ట్రీని ఒక ఊపు ఊప‌గా.. టాలీవుడ్‌లో మాత్రం శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద యుద్ధ‌మే సాగించింది. అయితే ఆత‌ర్వాత ఆ పోరు ప‌క్క‌దోవ ప‌ట్టింద‌నుకోండి. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ర‌చ్చ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

ఆషిక్ బానాయా ఆప్‌నే చిత్రంలో టైటిల్ పాట‌లో ముద్దుల వీరుడు ఇమ్రాన్ హ‌ష్మీ ముందు టాప్‌లెస్‌గా ద‌ర్శ‌నం ఇవ్వ‌డమే కాకుండా ఆ పాట‌లో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసిన హాట్ బ్యూటీ త‌నుశ్రీ ద‌త్తా ఇటీవ‌ల బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానాపాటేక‌ర్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని చెప్పి ఒక్కసారిగా అంద‌రికి షాక్ ఇచ్చింది. అయితే అప్పుడు త‌నుశ్రీ వ్యాఖ్య‌ల పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మైనా రోజులు గ‌డిచే కొద్ది ఆమెకు ప‌లువులు స్టార్ హీరోయిన్లు మ‌ద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో బీటౌన్‌లో మీటూ ఉద్యమం తెర‌పైకి వ‌చ్చి బాలీవుడ్ సినీ ప్ర‌పంచంలో ఊహించ‌ని ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

అయితే ఇప్పుడు చాలామంది హీర‌యిన్లు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల అనుభ‌వాల‌ను ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌హిర్గ‌తం చేస్తూ పెద్ద ర‌చ్చ‌కే తెర‌లేపుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ అయిత‌న వింటా నందా తనకు ఎదురైన అలాంటి అనుభ‌వాన్ని అనుభవాన్ని బ‌య‌ట‌ప పెట్టి పెద్ద షాకే ఇచ్చారు. దాదాపు 20 ఏళ్ళ క్రితం బాలీవుడ్ టీవీ-సినీ సీనియ‌ర్ న‌టుడు అలోక్‌నాథ్ త‌నకు బ‌ల‌వంతంగా మ‌ధ్యం తాగించి త‌న‌ను రేప్ చేశాడ‌ని.. త‌న‌తో పాటు చాలామందిని అత‌డు లైంగికంగా వేధించాడ‌ని.. అలోక్ పైకి మాత్రం బ‌డా మ‌నుషులుగా చ‌లామ‌ణి అవుతున్నాడ‌ని.. అయితే అత‌ను చీక‌టి ప‌డితే చాలు అత‌ను చేసే లీల‌లు మాత్రం చాలా ధారుణ‌మ‌ని ర‌చ‌యిత‌ వింటా నందా ఫైర్ అయ్యింది. దీంతో ఈ వ్యవ‌హారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.