ఆ సర్వేతో నాకు సంబంధం లేదు: లగడపాటి రాజ్ గోపాల్

Saturday, September 15th, 2018, 04:10:24 PM IST

తెలుగు రాజకీయాల్లో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన అనంతరం పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇటీవల కాలంలో రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. లగడపాటి ప్రత్యేకంగా నిర్వహించే సర్వే విషయాల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వచ్చే ఎలక్షన్స్ లో తెలంగాణలో ఎవరు గెలుస్తారు అనేది అందరికి ఒక అవగాహనా ఉంది. ఇకపోతే రీసెంట్ ఆయన న్సర్వే నిర్వహించారని ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై పలువురు పార్టీ నేతలు భిన్నాభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. లగడపాటి సర్వే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే తప్ప తెలంగాణాలో పనికిరాదని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో లగడపాటి సర్వే ఇదేనంటూ ఓ లిస్టు వైరల్ అవుతోంది. అది లగడపాటికి తెలియడంతో ఆయన స్పందించారు. ఆ సర్వే తనది కాదంటూ.. తనకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ద్వారా తెలిపారు. సోషల్ మీడియా లో వస్తున్న ప్రచారాలు అబద్ధాలని తన సర్వే ఎన్నికల షెడ్యూల్ తరువాత, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం వెల్లడిస్తాని రాజ్ గోపాల్ క్లారిటీ ఇచ్చారు.

నేటి ఏపి స్పెషల్ : గత ఏపి ఎన్నికల్లో తృటిలో ఓడిపోయిన నేతలు.. ఓ నేత 12 ఓట్లతో పరాజయం!

  •  
  •  
  •  
  •  

Comments