బ్రేకింగ్ : ఎగ్జిట్ పోల్ సర్వే రోజున లగడపాటి సంచలనం..?

Thursday, May 16th, 2019, 12:43:17 PM IST

ఇప్పుడు ఏపీ ప్రజలు ఫలితాలు వెల్లడి కాబోయే తారీఖు మే 23తో పాటు అంతకు ముందే రాబోయే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల వెల్లడి కాబోయే మే 19వ తేదీ కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు.ఆ రోజున రాబోయే ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా ఇక ఎవరు కేంద్రంలో మరియు రాష్ట్రంలో చక్రం తిప్పుతారు అన్నది దాదాపు ఆరోజు డిసైడ్ అయ్యిపోతుంది.అందుకనే ఆ రోజు కోసం ప్రతీ ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ ఎగ్జిట్ పోల్స్ పై అనేక రకాల ప్రముఖ సంస్థలు వారి సర్వే ఫలితాలను వెల్లడి చేస్తాయి.

వాటిలో సి ఓటర్ సర్వే,టైమ్స్ నౌ,ఎన్డీటీవీ అలాగే ఇంకొన్ని కొత్త సంస్థలు కూడా ఈసారి ఫలితాలను వెల్లడి చేయనున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు.ఇదిలా ఉండగా ఆరోజే సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ కూడా ఏపీ రాజకీయ పార్టీల ఫలితాలపై తన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడి చేస్తారు అని తెలుస్తుంది.దీనితో ఇప్పుడు అందరి కళ్ళు లగడపాటిపై పడ్డాయి.ఇప్పటికే లగడపాటి సర్వే అంటే అది ఇక దాదాపు ఖరారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

కానీ గడిచిన తెలంగాణా ఎన్నికల ఫలితాలలో లగడపాటి సర్వే పూర్తిగా తలకిందులు అయ్యిపోయింది.దీనితో ఈసారి ఏపీ రాజకీయాలపై లగడపాటి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి టీమ్ తో పక్కా సర్వే నిర్వహిచారట.ఎప్పుడు లేని విధంగా వీరి బృందం ఐదు వేల శాంపిల్స్ కలెక్ట్ చేశారని,ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అయినా సరే లగడపాటి చేయించారని తెలుస్తుంది.దీనితో ఎగ్జిట్ పోల్ సర్వే రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనానికి తెర లేపడం ఖాయమని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.