బ్రేకింగ్ పాలిటిక్స్.. లగడపాటి స‌ర్వే డేట్ ఫిక్స్.. వ‌చ్చేది ఆరోజే..?

Thursday, November 1st, 2018, 09:34:26 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే.. మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయాక అత‌ను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ క్ర‌మంలో ఆయ‌న పేరుతో అనేక స‌ర్వేలు తెర‌పైకి వ‌స్తున్నా.. ఆయ‌న మాత్రం వాటిని ఖండిస్తూ వ‌చ్చారు. అయితే తాజాగా తెలంగాణ‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల న‌గారా మోగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో ల‌గ‌పాటి స‌ర్వే రానుంద‌ని స‌మాచారం.

ల‌గ‌డ‌పాటి టీమ్ ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లో స‌ర్వేలు చేస్తుంద‌ని.. ఈ నేప‌ధ్యంలో అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంది.. టీఆర్ఎస్ పార్టీ పై ప్ర‌జలు పాజిటీవ్‌గా ఉన్నారా.. లేక మ‌హాకూట‌మి పై వారి గాలి మళ్ళిందా, ప‌ల్లెల నుండి ప‌ట్నాల వ‌ర‌కు ల‌గ‌పాటి టీమ్ ప్ర‌జ‌ల నాడి తెలుసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో డిసెంబ‌ర్ 7న ఎన్నిక‌ల త‌ర్వాత త‌న స‌ర్వే ఫ‌లితాలు విడుద‌ల చేస్తాన‌ని ల‌గ‌పాటి అన్నారు. ఇక 2014 నుండి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ల‌గ‌డ‌పాటి.. తెలంగాణ ప్ర‌జ‌ల నుండి తాను మ‌ళ్ళీ రాజ‌కీయాల్లోకి రావాల‌ని డిమాండ్స్ వినిస్తున్నాయ‌ని.. ఈ నేప‌ధ్యంలో అవ‌కాశం వ‌స్తే తాను తెలంగాణ నుండి పోటీ చేస్తాన‌ని ల‌గ‌డ‌పాటి అన్నారు. ఇక జ‌గ‌న్ పై దాడి పై స్పందిచ‌మ‌న‌గా తీవ్రంగా ఖండిచారు ల‌గ‌డ‌పాటి.. ఇలాంటి భౌతిక దాడులు స‌రికాద‌ని ల‌గ‌డ‌పాటి తేల్చి చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments