లగడపాటి సంచలనం..పోలీసులకు గట్టి వార్నింగ్.!

Friday, November 9th, 2018, 12:49:54 PM IST

తెలంగాణా రాష్ట్రం బంజారా హిల్స్ ప్రాంతంలో నిన్న రాత్రి ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి ఇంటి మీద అకస్మాత్తుగా పోలీసులు దాడి చెయ్యడం ఒక్కసారిగా కలకలం రేపింది.ఈ విషయాన్ని ఆయన కూతురు అతని సన్నిహితుడు అయినటువంటి లగడపాటి రాజ్ గోపాల్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే అక్కడికి వచ్చి,జీపీ రెడ్డిని అదుపులోకి తీసుకోవాడిని ప్రయత్నించిన పోలీసు అధికారులకు చుక్కలు చూపించారు.అసలు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇంత రాత్రి పూట దాడులకు ఎలా పాల్పడతారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పోలీసు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏమైనా చెయ్యొచ్చు అని ఇక్కడి డీసీపీ శ్రీనివాస్ గారు మరియు అతని సిబ్బంది ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.అసలు అరెస్ట్ వారెంటు సెర్చ్ వారెంటు లేకుండా ఇలా అర్ధ రాత్రి పూట ఇంట్లోకి అనుమతి లేకుండా రావడం సరికాదని,డీసీపీ,ఏసీపీ మరియు సీఐ లు అందరు కలిసి కుమ్మక్కయ్యి ఇలా ఆర్ద్రాత్రి పూట వచ్చి బెదిరింపులకు పాల్పడి సంతకాలు పెట్టించుకోవాలని చూస్తున్నారా నిప్పులు చెరిగారు.ఏదైనా ఉంటే ఉదయం పూత రావాలి కానీ ఇలా భార్యా పిల్లలు కలిసి ఉండే సమయంలో అకస్మాత్తుగా దాడులు చేస్తే ఏమిటి అర్ధం అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments