ఉత్తమ్ కి అంత అంత దమ్ము లేదు : లక్ష్మణ్

Wednesday, October 3rd, 2018, 01:28:51 AM IST

తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం రాజకీయ నాయకుల మధ్య న విమర్శల వెల్లువ కురుస్తోంది.. ఐతే తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లని ఉద్దేశించి విమర్శలు చేసిన సంగతి విదితమే… ఐతే ఈ విషయం పై మంగళవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఉత్తమ్ కుమార్ సొంతం గా కెసిఆర్ ని ఎదుర్కునే దమ్ము లేకనే మోడీకి కెసిఆర్ కి లింక్ పెట్టి మాట్లాడుతున్నారని , మోడీ దేశం కోసం 18 గంటలు పని చేస్తుంటే , కెసిఆర్ 18 గంటలు ఫేమ్ హౌస్ లో , రాహుల్ గాంధీ 18గంటలు విదేశాల్లో గడుపుతుంటారని ఎద్దేవా చేసారు. అలాంటి వాళ్ళతో మోడీ గారిని పోల్చటం సరి కాదని అన్నారు.

అంతేగాక పొత్తుల విషయం పై కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ లో కాంగ్రెస్ అంత బలం గా ఉంటె ఎందుకు చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తెరాస అంటే తెలంగాణ రజాకార్ల సమితి అని వ్యాఖ్యానించారు.అంతేగాక అమిత్ షా ని దమ్ముంటే హైదరాబాద్ లో ఒవైసీ మీద పోటీ చేయమని సవాలు విసరడం చాలా హాస్య స్పదం అన్నారు . మరియు ఒవైసీ మీద పోటీ చేయడానికి బీజేపీ కార్యకర్తలు చాలని అమిత్ షా అక్కర్లేదని సమాధానం ఇచ్చారు . .వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోడీ , అమిత్ షా , యోగి ఆదిత్యనాథ్ , తదితర జాతీయ పార్టీ నేతలు తెలంగాణ లో ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ తరుపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాభితా రెడీ చేసామనీ తొందర్లోనే , ఢిల్లీ లోని అధిష్టానానికి పంపుతామని చెప్పారు…