ఎన్టీఆర్ సతీమణి వ్యవహారమేమిటో అర్థమే కాదు!

Friday, October 19th, 2018, 01:30:19 PM IST

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుగారి సతీమణి లక్ష్మీ పార్వతి పొలిటికల్ స్టాన్డ్ ఏమిటో చాన్నాళ్ల నుండి అర్థంకావడం లేదు. భర్త ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశాన్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకున్నారనే కోపంతో అందులో చేరడం ఇష్టం లేక, బాబును గద్దె దించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ యొక్క వైకాపాలో చేరిన లక్ష్మీ పార్వతి ఎప్పుడు మాట్లాడినా నిరాసక్తతో, నిస్సత్తువతో, స్పష్టత లేకుండా మాట్లాడుతుంటారు.

రాజకీయాల్లో ఉంటూనే ప్రస్తుత రాజకీయాలు భ్రష్ఠు పట్టిపోయాయని, అంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారమైపోయిందని, ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాలని పలు సందర్భాల్లో జర్నలైస్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఆమె ఆ మాటలు తానున్న వైకాపాకి కూడా వర్తిస్తాయో లేదో చెప్పలేదు. తాజాగా కూడ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం మీద వివరణ ఇచ్చిన ఆమె ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేదని, కానీ వైకాపా గెలుపుకు కృషి చేస్తానని, జగన్ ఎక్కడ ప్రచారం చేయమంటే అక్కడ చేస్తానని అన్నారు.

ఇలా ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు కావాలన్న ఆమె మాటలు వింటుంటే వైకాపాలో డబ్బు మీదే టికెట్ల కేటాయింపులు నడుస్తున్నాయని, అందులోని నేతల గెలుపు ఓటములను కూడ డబ్బే డిసైడ్ చేస్తుందని, తన వద్ద ఆ డబ్బే లేకపోవడంతో టికెట్ రాదని, పోటీ చేయలేనని అన్నట్టు ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments