నా పరువు, మర్యాదలు కాపాడండి..! డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు..

Monday, April 15th, 2019, 06:00:38 PM IST

ఏపీలో ఎన్నికలకు ముందు కోటి అనే యువకుడు లక్ష్మీ పార్వతిపై చేసిన ఆరోపణలు మొత్తం తెలుగు ప్రజానీకాన్నే ఆశ్చర్యపరిచేలా చేశాయి. తనను లక్ష్మీ పార్వతి లైంగికగా వేదిస్తుందని మిస్‌ యూ, లవ్‌ యూ అంటూ మెసేజ్‌లు పంపడమే కాకుండా, తన వాట్సప్‌కి అశ్లీల వీడియోలను కూడా పంపిస్తుందని గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే లక్ష్మీ పార్వతీ ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తూ కోటి అనే యువకుడితో పాటు కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేసుకుని, కావాలని తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై ఆరోపణలు చేస్తున్న కోటి నా బిడ్దలాంటి వాడని, అలాంటి వ్యక్తి నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలలో ఏదో కుట్ర దాగి ఉందని, ఆ కుట్రలను చేదించి తనకు న్యాయం చేయాలని అంతేకాకుండా తన పరువు, మర్యాదలు తీయాలనుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె నేడు డీజీపి మహేందర్ రెడ్డిని కలిసి తన ఫిర్యాదును అందచేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, దీని వెనుక ఉన్న సూత్రధారులను వీలైనంత త్వరగా పట్టుకుని ఈ కేసును చేధించాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని మీడియా ద్వారా ప్రకటించారు.