ధోని తో ఎఫైర్.. బయట పడుతుందేమోనని భయపడుతున్న లక్ష్మీ రాయ్..?

Tuesday, September 27th, 2016, 11:30:07 AM IST

lakshmi-rai-dhoni
మహేంద్ర సింగ్ ధోని జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “ఎం ఎస్ ధోని – అన్ టోల్డ్ స్టోరీ” త్వరలో విడుదలకాబోతోంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ చిత్రం కోసం దేశమంతా తృతగా ఎదురుచూస్తోంది.కానీ హాట్ భామ లక్ష్మిరాయ్ మాత్రం భయంతో ఎదురుచూస్తోంది.ఎందుకంటారా..? వివరాల్లోకి వెళదాం..

2008 ఐపిఎల్ సందర్భంగా ఓ ఏడాదిపాటు లక్ష్మిరాయ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.ఆ సమయంలో ధోని, లక్ష్మి రాయ్ లమధ్య ఎఫైర్ నడుస్తోందటూ వార్తలు వచ్చాయి.ప్రస్తుతం ఈ చిత్రం విడుదలవుతుండటంతో లక్ష్మీరాయ్ లో భయం మొదలైంది.దర్శకుడు తనపాత్రనేమైనా పొందుపరిచాడా అని భయపడుతోంది.ఒకవేళ చిత్రం లో తన పాత్ర ఉంటె ధోని తో తన ప్రేమాయణం అందరికి తెలిసిపోతుందేమోనని ఈ భామ బెంగ పెట్టుకుంది.లక్ష్మీరాయ్ ఎం ఎస్ ధోని చిత్రం విడుదల గురించి స్పందించింది.తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అంబాసిడర్ గా ఉన్నప్పుడు మాత్రమే ధోని తో స్నేహం చేశానని, ఆతరువాత దీనితో టచ్ లో లేనని తెలిపింది.ఇది ముగిసిన ఎనిమిదేళ్ల తరువాత కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదని లక్ష్మి రాయ్ అంది.ఈ చిత్రం కథ తెలుసుకునేందుకు ప్రయత్నించానని అయితే ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది.

Comments