ఎవ్వరికి భయపడను..నేను రాయలసీమ బిడ్డను :లక్ష్మిస్ ఎన్టీఆర్ నిర్మాత

Sunday, October 22nd, 2017, 12:17:37 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి రోజు ఎదో ఒక న్యూస్ హల్ చల్ చేస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే దర్శకుడు వర్మపై అనేక ఆరోపణలు చేశారు. ఇక సినిమాను నిర్మిస్తోన్న వైసిపి నేత రాకేష్ పై కూడా పలు రకాల ఆరోపణలు చేశారు. అతనికి సినిమా తీసేంత డబ్బు లేదని జగన్ అండతోనే సినిమాను నిర్మిస్తున్నారని ఆరోపించారు. అయితే వర్మ సినిమాపై వస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్ వేస్తూనే ఉన్నారు.

రీసెంట్ గా ఆ తరహా ఆరోపణలపై చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కూడా స్పందించారు. అంతే కాకుండా ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారి మీద అభిమానంతోనే ఈ సినిమా చేస్తున్నాని వర్మ క్రియేటివిటీ కూడా చాలా బావుంటుంది అందుకే ఈ సినిమాను నిర్మిస్తున్నాని రాకేష్ తెలిపారు. ఇక సినిమాని నిర్మించేంత డబ్బు లేదని నిరూపిస్తే ఏం చెప్పినా చేస్తానని చెప్పాడు. అంతే కాకుండా సినిమాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రకు సంబందించిన సీన్స్ కూడా ఉంటాయని చెబుతూ.. ఎవ్వరికి భయపడను నేను కూడా రాయలసీమ బిడ్డనే అలీని బదులిచ్చారు.

లక్ష్మి పార్వతి పాత్రలో రోజా నటిస్తుందా లేదా అన్న ప్రశ్నకు త్వరలోనే ఒక క్లారిటిని ఇస్తామని చెప్పారు. అయితే ఈ సినిమాలో రామారావు గారికి వెన్నుపొటు పొడవడం వంటి సీన్స్ ఏమైనా ఉంటాయా అని అడిగితే.. వెన్ను పోటు పొడవడం మీరు చూశారా ? అని రాకేష్ తెలిపారు. అదే విధంగా అయితే వెన్ను పోటు పొడవలేదు అని మీరంటారా అంటే ఆ విషయాన్ని సినిమాలోనే తెలుసుకోవాలని సీరియస్ గా ఆన్సర్ ఇచ్చారు.