లాలూకి పెరోల్.. పొరపాటు జరిగితే కఠిన చర్యలే!

Thursday, May 10th, 2018, 10:03:31 PM IST

బీహార్ దాణా కుంభకోణం కేసులో జనవరిలో నిందితులకు సిబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ చీఫ్‌, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొన్న ఆయనకు మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష అలాగే ఐదు లక్షల జరిమానా కోర్టు విధించింది. ఇకపోతే లాలూ కొడుకు వివాహ ఉన్న నేపథ్యంలో అతనికి పెరోల్ లభించింది. గత కొంత కాలంగా 5 రోజుల పెరోల్ కోసం లాలూ న్యాయస్థానం కోరగా ఫైనల్ గా మూడు రోజులు ఇచ్చారు. అందులో కూడా ఆయనకు షరతులు విధించారు.

ఈ నెల 12న లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ వివాహం జరగనుంది. బిహార్‌కు మాజీ మంత్రి చంద్రికా రాయ్‌ కుమార్తె ఐశ్వర్యరాయ్‌ను తేజ్‌ పెళ్లాడబోతున్నారు. అయితే పెరోల్ నిబంధనలు ఏ మాత్రం ఉల్లఘించకూడదని ఝార్ఖండ్‌ తెలిపింది. మీడియా సమావేశాలను నిర్వహించకూడదు. పార్టీ నేతలను కలవకూడదు. లాలూ ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు అనేది వీడియోలో రికార్డ్ అవుతుంది. అయన వద్ద పోలీస్ అధికారులు ఉండి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటిల్లో లాలూ నుంచి ఎలాంటి పరపాట్లు జరిపిన కఠిన చర్యలు తప్పవని న్యాయస్థానం తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments