ఆసుపత్రిలో లాలూ ప్రసాద్ యాదవ్ … పరిస్థితి ఎలా ఉందంటే..!

Saturday, May 19th, 2018, 01:06:26 PM IST

ప్రముఖ దాణా కుంభకోణంలో చిక్కుకున్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ పరిస్థితి చాలా విషమంగా మారింది. శ్వాసకోస సంబందిత బాధ పడుతున్న లాలూని అకస్మాత్తుగా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే చాలా రోజుల నుండి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ఈ మధ్య అనారోగ్యంతో క్షీనించారు. పరిస్థితి గమనించిన మొదటి కుమారుడు తాజ్ ప్రతాప్ యాదవ్ డాక్టర్లను సంప్రదించగా తనని వెంటనే ఇందిరా గాంధీ ఇన్స్ టిట్యూట్ కి తరలించాలని ఆదేశించారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకుపోగా ఇదివరకటికంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఇంకా క్షీణించిందని, ఆయన ఆరోగ్యంపై ఇకనుంచి చాలా జాగ్రత్తలు చీసుకోవాలని హెచ్చరించారు. మొదటి కుమారుడు తాజ్ ప్రతాప్ వివాహానికి మూడు రోజుల ముందు పెరోల్ పై లాలూ జైలు నుండి వాడుదలై వచ్చి వెళ్ళగా తిరిగి బెయిల్ పై లాలూ ప్రస్తుతం బయటకు వచ్చియా సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments