సఫారీల చేతిలో ఓటమి పాలైన లంక… గెలుపు అందించిన లెస్బియన్ జంట…

Thursday, November 15th, 2018, 03:01:01 AM IST

కరేబియన్ లో జరిగిన టీ 20 మహిళా ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక ఓటమి పాలైంది. ఈ ఆట లో ఒక లెస్బియన్ జంట రాణించి, విజయాన్ని సాధించి పెట్టింది. ఈ ప్రపంచ కప్ లో భాగంగా తొలిసారిగా ఒక లెస్బియన్ జంట దక్షణఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డీన్ వాన్ నికేర్క్, అల్ రౌండర్ మరిజాన్నే కాప్ లు కలిసి ఆడారు. దీనిలో శ్రీలంక జట్టు 8 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసారు. సఫారీల బౌలర్ 4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. ఆ తరువాత 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి దక్షిణాఫ్రికా జట్టు 6 పరుగులకే ఓపెనర్లు లీ(1), వోల్వార్డ్(4) ల వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకొచ్చిన మరిజాన్నే కాప్ (38: 44 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ (33 నాటౌట్: బంతుల్లో 2 ఫోర్లు) మూడో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తరువాత కాప్ ఓటైనా, డు ప్రీజ్ (16 నాటౌట్) సాయంతో కెప్టెన్ నికెర్క్ దక్షిణాఫ్రికాని విజయం వైపు నడిపించింది. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.

డఖిణాఫ్రికా టీం బౌలింగ్‌లోనూ కాప్, నికెర్క్‌లు చెరో వికెట్ తీసి ఆల్ రౌండర్లుగా సత్తా చాటారు. అయితే డేన్‌ వాన్‌ నికెర్క్, మరిజాన్నే కాప్‌లు జూలైలో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. లెస్బియన్, గే వివాహాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో వీరి వివాహానికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌ను, మరో మహిళా క్రికెటర్ లియా తహుహు పెళ్లి చేసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.