భారత సైన్యం చాలా మంచిది : లష్కరే తోయిబా ఉగ్రవాది

Friday, May 11th, 2018, 08:59:10 AM IST

ఉగ్రవాదం అనేది గత కొంత కాలంగా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ దేశాలు వాటిపై చర్యలు ఏ స్థాయిలో తీసుకుంటున్నా కూడా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. అయితే మాయ మాటలో పడి కొందరు యువకులు తప్పు ద్రోవలో నడుస్తున్నారు. ఉగ్రవాదుల చర్యలు ఎవరు నమ్మవద్దని ఎంత మంది చెప్పినా కూడా లాభం లేకపోయింది. అయితే ఇప్పుడు ఉగ్రవాదులే ఉగ్రవాదంలోకి వెళ్లకండి అని చెబుతున్నారు. బయట ప్రపంచంలో చాలా జీవితం ఉంది. హింసాత్మక జీవితం మనోకొద్దని ఇటీవల ఒక లష్కరే తాయిబా వ్యక్తి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నా పేరు ఐజాజ్ అహ్మద్ గోజ్రీ. నా ఫ్యామిలీని వదిలి హింసామార్గంలో వెళుతోన్న నా ఫ్రెండ్స్ సుహైబ్ అఖూన్, మొహ్సిన్ ముస్తాక్ భట్, నాసిర్, అమీన్ ద్రాజీలకు ఇదే నా విన్నపం. అందమైన జీవితాన్ని, కుటుంబాలను విడిచి హింసామార్గాన్ని ఎంచుకున్న మీరు వీలైనంత త్వరగా మీ కుటుంబాల వద్దకు వెళ్లండి. నాసిర్.. మీ అమ్మగారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటికొచ్చెయ్’’ అని అంటూ.. భారత సైనిక దళం గురించి ఆ వ్యక్తి గొప్పగా చెప్పాడు. ఇటీవల కాశ్మీర్ లోముగ్గురు బాలలను చంపినా కేసులో 10 మందిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే తమని వెంటాడే సమయంలో కాల్చి చంపేసే అవకాశం ఉన్నప్పటికీ భారత సైన్యం అలా చేయలేదని ప్రాణాలతో పట్టుకుందని గోజ్రీ పేర్కొన్నాడు. పాకిస్తాన్ నేతల కారణంగానే కాశ్మీర్ యువత చెడిపోతోంది అంటూ అతను విమర్శలు చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments