కర్ణాటకలో చివరి దశకు పదవుల కేటాయింపులు!

Friday, June 1st, 2018, 01:11:04 AM IST

మంచి రసవత్తరంగా సాగిన ఇటీవలి కర్ణాటక ఎన్నికలు ఫలితాలు తేలాక హంగ్ గా ముగియడంతో ముందుగానే పరిస్థితిని అంచనా వేసిన కాంగ్రెస్, జెడిఎస్ తో పొత్తుకు సిద్దమయింది. అయితే రెండవ స్థానంలో నిలిచినా కాంగ్రెస్, మూడవ స్థానంలో నిలిచిన జేడీఎస్ లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంకాగా గవర్నర్ అనూహ్యంగా బిజెపి ని ఆహ్వానించి యెడ్యూరప్పతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే తరువాత సుప్రీమ్ జోక్యంతో ఆయన కేవలాం నాలుగు రోజుల సీఎంగా ఉండి రాజీనామా చేసారు. తదనంతరం జెడిఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కుమారస్వాయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవడం జరిగాయి. అయితే అప్పటినుండి ఈ రెండు పార్టీల మధ్య పదవుల పంపకం విషయమై మాత్రం కొంతమేర అంతర్యుద్ధం జరుగుతోందని ప్రచారం సాగుతోంది.

కాగా నేడు వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ హోమ్ శాఖను, జేడీఎస్ ఆర్ధిక శాఖలను పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే మొత్తంగా కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇప్పటికే అమెరికాలో వున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇక్కడి నేతలతో చర్చసాగించి ఈ విషయాన్నీ ఒక కొలిక్కి తెచ్చారు. అయితే సభ్యుల్లో ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇవ్వాలి అనేదానిపైనే స్పష్టత రావలివుందని తెలుస్తోంది. పదవులను కూడా వెనువెంటనే ఆయా నేతలకు కట్టపెట్టి కుమారస్వామి బలమైన క్యాబినెట్ ను ఏర్పరచుకోనున్నారని, ప్రజల కోసమే ఏర్పాటైన తమ కూటమి ప్రజా సంక్షేమానికే అంకితమని ఆ పార్టీల నేతలు అంటున్నారు…..