పరీక్షకు మూడు సెకన్లు ఆలస్యం అయ్యిందని..

Sunday, May 6th, 2018, 11:21:30 AM IST

పరీక్షా కేంద్రం ముందు ముప్పై నిముషాలు ముందే ఉండాలని విద్యా శాఖ ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసిన ఎక్కడో ఒక చోట విద్యార్థులు ఆలస్యంగా వచ్చి పరీక్షకు హాజరుకాలేకపోతున్నారు. వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది పరీక్షా నిర్వహణ అధికారులు పట్టించుకోరు. ఒక్క సెకన్ ఆలస్యం వచ్చినా కూడా గెట్ లోపలికి అడుగుపెట్టనివ్వడం లేదు. ఇక ఈ రోజు నిర్వహించిన నీట్ పరీక్షకు కూడా పలు కేంద్రాల్లో విద్యార్థులు ఆలస్యంగా వచ్చి బహిష్కరణకు గురయ్యారు.

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కూడా డీఏవీ సెంటర్ లో నిమిషం ఆలస్యం అయ్యిందని విద్యార్థులను పరీక్షకు హాజరుకానివ్వలేదు. ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభం. అయితే అధికారులు 9 గంటల 30 నిమిషాలకే గేట్లు మూసేశారు. గెట్ క్లోజ్ చేస్తున్నారని ఓ విద్యార్థిని కొన్ని అడుగుల దూరంలో నుండి పరిగెత్తుకుంటూ వస్తుండగా మూడు సెకన్ల వ్యవధిలో గేట్లు మూసేశారు. దీంతో బాలిక గేటు ముందే కన్నీరు పెట్టుకుంది. ఆ తరువాత కొన్ని నిమిషాల తరువాత వచ్చిన విద్యార్థులు కూడా ఆలస్యం అయినందుకు బాదపడ్డారు. ఎంత బ్రతిమాలినా గెట్ తెరవలేదు. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్యలో ప్రవేశానికి గల నీట్ పరీక్షకు 13,26,275 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో అమ్మాయిలే 56.25 శాతం మంది ఉన్నారు. పరీక్ష కోసం ఏపిలో 86, తెలంగాణలో 81 కేంద్రాలను ఏర్పాటు చేశారు.