లేటెస్ట్ : ఐపీఎల్ అభిమానులకు ఉచిత భోజన పధకం?

Wednesday, April 11th, 2018, 12:55:43 AM IST


ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. టీ 20 ఫార్మాట్ కు మరింత వన్నెతెచ్చిన ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కోట్లాది మంది అభిమానులు ప్రతిసంవత్సరం ఎదురుచూపులు చూస్తుంటారంటే ఐపీఎల్ కు వున్న క్రేజ్ ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఒకరకంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌ మెగా టోర్నీఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఐతే, గత రెండు మూడేళ్లగా ఈ మ్యాచ్ లకు టివి రేటింగ్ ల పరంగా భారీ స్థాయిలో వీక్షకులు ఉన్నప్పటికీ, మ్యాచ్ లు జరుగుతున్న గ్రౌండ్ లకు మాత్రం అభిమానులు ఆశించిన స్థాయిలో రావట్లేదు. ఐతే అభిమానుల్ని మైదానాలకు రప్పించేందుకు నిర్వాహకులు కొత్త కొత్త ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభమై నాలుగు రోజులైంది.

ఆది, సోమవారాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో మైదానంలోని కొన్ని గ్యాలరీలు అభిమానులు లేక వెలవెలబోతూనే కనిపించాయి. అభిమానుల్ని ఎలా మైదానాలకు రప్పించాలా అని నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు బుమ్రా ఓ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ చూసేందుకు వచ్చే అభిమానులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తే మ్యాచ్‌ టిక్కెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతాయని అతడి ఆలోచనట. ఉన్నఫళంగా తన ఆలోచనను ఐపీఎల్ నిర్వాహకులకు తెలిపాడట. మరి, ఐపీఎల్‌ టోర్నీ నిర్వాహకులు బుమ్రా ఇచ్చిన సలహాను ఏ మేరకు అమలు చేస్తారో, లేక అటకెక్కిస్తారో చూడాలి మరి. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తోంది……

  •  
  •  
  •  
  •  

Comments