లేటెస్ట్ : వామపక్ష నేతలకు షాకిచ్చిన జనసేన కార్యాలయ సిబ్బంది!

Thursday, April 12th, 2018, 05:12:10 PM IST

నేడు వామపక్ష నేతలకు జనసేన కార్యాలయం వద్ద పెద్ద షాక్ తగిలింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు మరో ఇద్దరు నాయకులు మధ్యాహ్నం జనసేన కార్యాలయానికి వచ్చారు. కాగా వీరిని కార్యాలయంలోకి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించడంతో కాసేపు చిన్నపాటి వివాదం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందేమో తమకు సమాచారం లేదని, లోనికి అనుమతించమంటూ వారిని అడ్డుకున్నారు.

దీంతో చేసేదేమీలేక దాదాపు ఓ పావుగంట సేపు అలాగే గేటు బయట వామపక్ష నేతలు నిల్చుండిపోయారు. అయితే ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో సమావేశమయినట్లు తెలుస్తోంది. విషయాన్ని తెలుసుకున్న పవన్ వారిని లోనికి పంపాల్సిందిగా సెక్యూరిటీకి తెలపడంతో చివరికి వామపక్ష నేతలు లోపలికి వెళ్లారు. ఈ చిన్నపాటి వివాదంతో వామపక్ష నేతలు కొంతమేర నిరుత్సాహనికి గురైనట్లు తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments