లేటెస్ట్ : టిడిపి పై విరుచుకుపడ్డ క్రిటిక్ ‘కత్తి మహేష్’

Wednesday, March 21st, 2018, 02:14:57 AM IST

కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్ అభిమానులతో వివాదం పెట్టుకున్న ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఆ తరువాత పలు న్యూస్ చానెల్స్ లో కనపడుతున్నప్పటికీ ఒకింత నెమ్మదిగానే మాట్లాడుతున్నారు. కానీ కొద్దిరోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో మళ్లి కత్తి తన మాటలకు పదును పెట్టారు. అయితే నేడు ఆంధ్రకు ప్రత్యేక హోదా విషయమై టాలీవుడ్ ప్రముఖులెవరు తమ మద్దతు ప్రకటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్యెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు కత్తి ధీటుగా సమాధానమిచ్చారు.

అయితే ఈ విషయమై తన అభిప్రాయాన్ని తెల్పుతూ కత్తి మహేష్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. శివాజీ, పవన్ కళ్యాణ్, నిఖిల్ సిద్దార్థ, సంపూర్ణేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, మంచు మనోజ్, కొరటాల శివ, తాను అంతకుముందే ప్రత్యేక హోదా గురించి మాట్లాడారని, అలానే ఉద్యమాలలో పోరాడారని అన్నారు. నిన్నటికి నిన్న కళ్ళు తెరిచి హోదారాగం ఎత్తుకున్న టిడిపి నాయకులకు కళ్ళు నెత్తికెక్కినట్టు ఉన్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సినీ పరిశ్రమ పై అనవసరంగా బురద చల్లొద్దని, మాటలు జాగ్రత్త అని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. ఉన్న హీరోలందరూ ఎదో ఒక రకంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్లేగా. అందులో బాలకృష్ణ ఒక్కరు చాలరా అవార్డులు పంచుకున్న బ్యాచ్ ఎక్కడ. మీరు వైజాగ్‌లో భూములు ఇచ్చిన స్టార్లు ఎక్కడ. బొడ్డు, జఘనాల డైరెక్టర్ తిరుమలలోనే ఉన్నారుగా. బోయపాటి శీను ఎక్కడా. అంటూ కత్తి టిడిపి కి పలు ప్రశ్నలు గుప్పించారు. అయితే ఈ విషయమై టిడిపి నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు…

  •  
  •  
  •  
  •  

Comments