రాష్ట్రం లో పార్టీని బలోపితం చేస్తోన్న కాంగ్రెస్ నాయకులు

Saturday, October 6th, 2018, 02:21:03 AM IST


ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికలు దగ్గర పడుతుండటం తో కాంగ్రెస్ తమదైన శైలి లో ముందుకు సాగుతోంది . ఇటీవలే కాంగ్రెస్ నాయకులూ ఇందులో భాగం గా “ఇంటింటా కాంగ్రెస్‌ అభయహస్తం” అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఈ కార్యక్రమానికి అశేష స్పందన లభిస్తుండటం తో మరో ఈ నెల రోజులూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు మరింత దగ్గర కావాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐతే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న నాయకులు ప్రజల దగ్గరకు వెళుతూ వారి సమస్యలు తెలుసుకుంటూనే మరో పక్క స్థానికంగా ఉండేటువంటి నాయకులతో సమావేశమైతూ , పార్టీ ని రాష్ట్రం లో బలోపితం చేయడానికి కావాల్సిన అంశాల గురించి చర్చిస్తున్నారు…

ఇంటింటా కాంగ్రెస్‌ లో భాగం గా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కడప జిల్లాలోని బద్వేల్ లో పర్యటిస్తస్తూ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే మొదటగా రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా పై, మలి సంతకం రూ.2 లక్షల వరకూ రైతుల రుణమాఫీ ఫైళ్ల పై సంతకం చేస్తారని చెప్పారు…. అంతే గాక వచ్చే ఎన్నికల్లో కేంద్రం లోనూ మరియు రాష్ట్రం లో తమ పార్టీనే అధికారం చేపడుతామని ధీమా వ్యక్తం చేసారు. తమ పార్టీ అధికారం లోకి రాగానే ప్రతి ఇంటికి సంవత్సరానికి 4 సిలెండర్లు ఉచితంగా ఇస్తామని , కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 100 రోజుల్లోపు ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు . ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ లాగే బీసీ మైనారిటీ లకు కూడా ఒక సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేట్లు చూస్తామని తెలిపారు…. వచ్చే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లను కాంగ్రెస్ పార్టీ కి వేసి గెలిపించమని కోరారు. ఐతే పర్యటనలో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు , సీనియర్‌ నేత తులసిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు