పవన్.. ఏదైనా సరే జనాలకు చెప్పి చేయండి !

Friday, September 14th, 2018, 12:09:38 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సామాన్య ప్రజానీకంలో ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు, ఉన్నట్టుండి కనిపించకుండా పోతారు అనే అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్టే అప్పుడప్పుడూ ప్రవర్తిస్తుంటారాయన. తాజాగా పది రోజుల క్రితం వరకు పోరాట యాత్ర పేరుతో విస్తృత పర్యటనలు చేసిన ఆయన ఉన్నట్టుండి ప్రజాక్షేత్రం నుండి మాయమైపోయారు. దీంతో ప్రజల్లో ఉన్న పాత అభిప్రాయం మరోసారి నిద్రలేచింది.

వాస్తవానికి పవన్ గత పది రోజులుగా ఖాళీగా ఏమీ లేరు. పార్టీ అంతర్గత నిర్మాణంలో భాగంగా గోదావరి జిల్లాల నేతల్ని పార్టీలో కలుపుకుంటూ, భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా క్యాడర్ కు దిశానిర్థేశం చేసే పనుల్లోనే బిజీగా ఉన్నారు. కానీ ఈ విషయం సామాన్య జనాల్లో ఎంతమందికి తెలుసనేదే ప్రశ్న. ఇప్పటికే ఒక వర్గం మీడియా పవన్ ను పూర్తిగా దూరం పెట్టడంతో ఆయన అంతర్గత కార్యకలాపాల గురించి ప్రజలకి తెలిసే అవకాశాలు చాలా తక్కువ.

ఇలాంటి క్లిష్ట స్థితిలో పవన్ ఇలా ఉన్నట్టుండి 10, 20 రోజులు జనాలకు కనిపించకుండా పార్టీ కార్యాలయాల్లోనే ఉండిపోవడం కొంత నష్టం కలిగించే విషయమే. కాబట్టి పవన్ తాను అందుబాటులో లేకుండా వెళ్లే ముందు ప్రజలందరికీ తెలిసేలా ఒక ప్రకటన చేసి, ఎందుకు వెళుతున్నది, మళ్ళీ ఎప్పుడు వచ్చేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. దీని ద్వారా ఆయన జవాబుదారీతనంపై కూడ ప్రజలకి ఇంకొంత నమ్మకం ఎర్పడే అవకాశాలు లేకపోలేదు.

  •  
  •  
  •  
  •  

Comments